YSRCP: వైసీపీ ఇచ్చేది ‘నవరత్నాలు’ కాదు నవగ్రహాలు: సీఎం చంద్రబాబు సెటైర్లు

  • మోదీ నాయకత్వాన్ని ప్రజలు ‘ఛీ’ కొడుతున్నారు
  • మన ప్రతిపక్షనాయకుడు ఆయన పక్కన చేరాడు
  • ఎన్టీఆర్ కృషి ఫలితంగా సర్కారియా కమిషన్ వచ్చింది
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే నవరత్నాల వంటి పథకాలను అమలు చేస్తానని వైసీసీ అధినేత జగన్ ప్రజలకు హామీ ఇవ్వడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సెటైర్లు విసిరారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ఇచ్చేది నవరత్నాలు కాదు నవగ్రహాలని అన్నారు.

దేశ వ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని ప్రజలు ‘ఛీ’ కొడుతుంటే, మన ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఆయన పక్కనే చేరాడని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల అంశంలో అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ కృషి ఫలితంగా ఆనాడు సర్కారియా కమిషన్ వేశారని, రాష్ట్ర హక్కులకు సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోవాడానికి మీరెవరు? అని మోదీని చంద్రబాబు ప్రశ్నించారు.
YSRCP
jagan
Telugudesam
Chandrababu
cm
amaravathi
modi
bjp
NTR
sarkaria commission

More Telugu News