amaravathi: ‘జన్మభూమి’ని పవిత్ర కార్యక్రమంగా భావించి పనిచేశాం: సీఎం చంద్రబాబు

  • అందుకే, ఈ కార్యక్రమం విజయవంతమైంది
  • ప్రజలు పాల్గొన్నప్పుడే ఏ కార్యక్రమానికైనా సార్ధకత
  • రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరుసార్లు ‘జన్మభూమి’ నిర్వహించాం
‘జన్మభూమి’ని పవిత్ర కార్యక్రమంగా భావించి పనిచేశామని, అందుకే, ఈ కార్యక్రమం విజయవంతమైందని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతిలోని ప్రజా వేదిక నుంచి మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏ పని చేసినా మంచి ఫలితాలొస్తాయని, ప్రజలు పాల్గొన్నప్పుడే ఏ కార్యక్రమానికైనా సార్ధకత వస్తుందని అన్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరుసార్లు ‘జన్మభూమి’ కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, తమ ప్రభుత్వం పారదర్శకంగా పని చేయడం వల్లే ‘జన్మభూమి’ కార్యక్రమంలో గొడవలు చేయాలనుకునేవారు ఏమీ చేయలేకపోయారని అన్నారు. ‘వయాడక్ట్’ అనే కాన్సెప్ట్ ను అన్ని స్థాయుల్లో అమలు చేయడానికి ఈ కార్యక్రమం స్ఫూర్తి నిచ్చిందని తెలిపారు. ‘జన్మభూమి’ కార్యక్రమంలో లక్షా 28 వేల మంది అధికారులు, మండల స్థాయిలో 1,880 మొబైల్ బృందాలు పని చేసినట్లు చెప్పారు. 
amaravathi
janmabhumi
Chandrababu
Andhra Pradesh
cm

More Telugu News