pawan kalyan: పవన్ కల్యాణ్.. నా ప్రశ్నకు సమాధానం చెప్పు: బొత్స

  • టీడీపీతో సంబంధాలు ఉన్నాయో, లేదో చెప్పండి
  • పింఛన్లను రూ. 2 వేలకు పెంచడం వైసీపీ ఘనతే
  • జగన్ దాడి కేసును ఎన్ఐఏకు బదిలీ చేస్తే చంద్రబాబుకు ఎందుకు భయం?
ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ఉత్సుకత జనసేనాని పవన్ కల్యాణ్ లో కనిపిస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీతో సంబంధాలు ఉన్నాయో, లేదో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో పింఛన్ ను రూ. 2వేలకు పెంచడం వైసీపీ ఘనతేనని చెప్పారు. తమ పార్టీ ప్రకటించిన నవరత్నాలలో ఈ పథకం కూడా ఉందని... ఆ భయంతోనే సీఎం చంద్రబాబు ముందుగానే పింఛనును పెంచేశారని తెలిపారు.

జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని తప్పుబడుతూ చంద్రబాబు లేఖ రాయం సరికాదని బొత్స అన్నారు. ఎన్ఐఏతో విచారణ జరిపించాలని కోర్టే ఆదేశించిందని చెప్పారు. జగన్ పై హత్యాయత్నం జరిగిందని ఏపీ పోలీసుల నివేదికలో కూడా ఉందని తెలిపారు. కేసును ఎన్ఐఏకు బదిలీ చేస్తే చంద్రబాబుకు భయం ఎందుకని ఎద్దేవా చేశారు.
pawan kalyan
botsa
janasena
Telugudesam
YSRCP
Chandrababu
jagan

More Telugu News