Australia vs India: సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ

  • 4 సిక్స్ లు, 7 ఫోర్ల తో సెంచరీ పూర్తి
  • ప్రస్తుతం క్రీజ్ లో జడేజా, రోహిత్
  • భారత్ స్కోర్  184/5
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు. 110 బంతులు ఆడిన రోహిత్ 4 సిక్స్ లు, 7 ఫోర్ల తో సెంచరీ పూర్తి చేశాడు. 289 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే కీలక వికెట్లని కోల్పోయింది. ఈ దశలో ధోని, రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ బోర్డుని ముందుకు నడిపించారు. 51 పరుగులు పూర్తి చేసిన ధోని బెహ్రెన్డెర్ఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో జడేజా (3),రోహిత్ శర్మ(103) ఉన్నారు. మరో వైపు ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్ సన్ 3 వికెట్లు తీయగా, బెహ్రెన్డెర్ఫ్ రెండు వికెట్లని పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 41 ఓవర్లలో 184/5.
Australia vs India
AusvInd
Cricket
Rohit Sharma
MS Dhoni

More Telugu News