Pawan Kalyan: మీతో మాట్లాడిన టీఆర్ఎస్ వాళ్లెవరో చెప్పండి: పవన్ కల్యాణ్ పై వైసీపీ ఆగ్రహం

  • జనసేనతో పొత్తుకు వైసీపీ యత్నిస్తోందన్న పవన్
  • అంత అవసరం మాకు లేదన్న వైసీపీ
  • టీడీపీతో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్
జనసేనతో పొత్తుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, దీనికి సంబంధించి టీఆర్ఎస్ నేతలు తనను సంప్రదించారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు మండిపడ్డారు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ వాళ్లు ఎవరు మాట్లాడారో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ వద్దకు వచ్చిన వారు అధికారికంగా వచ్చారో, లేక వ్యక్తిగతంగా వచ్చారో చెక్ చేసుకుని మాట్లాడాలని సూచించారు. టీడీపీతో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని పవన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 
Pawan Kalyan
janasena
TRS
ysrcp
alliance

More Telugu News