Chandrababu: రేషన్ డీలర్లకు సంక్రాంతి కానుక.. గుడ్ న్యూస్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

  • సరుకుల పంపిణీ కమిషన్ ప్రస్తుతం 75 పైసలు 
  • ఇది రూపాయికి పెంపు
  • ప్రభుత్వ నిర్ణయంతో 29వేల మంది రేషన్ డీలర్లకు లబ్ధి 
రేషన్ డీలర్లకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుకను ప్రకటించింది. సరుకుల పంపిణీ కమిషన్ 75 పైసల నుంచి రూపాయికి పెంచుతున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, రేషన్ డీలర్లకు కమిషన్ పెంచాలని ఆదేశించామని తెలిపారు. దీంతో పంచదార, బియ్యం, రాగులు, జొన్నలు, కందిపప్పు కమిషన్ ను ఒక రూపాయి చేశామని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 29 వేల రేషన్ డీలర్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. గత ఏడాది చంద్రన్న కానుకల కమిషన్ ను రూ. 5 నుంచి రూ. 10కి పెంచామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 25 పైసలు ఉన్న కమిషన్ ను రూపాయి చేశామని చెప్పారు. 
Chandrababu
prathipati pullarao
ration
dealers
commission

More Telugu News