Andhra Pradesh: మాతో పొత్తు కోసం కొందరు మధ్యవర్తులతో మాట్లాడిస్తున్నారు!: వైసీపీపై పవన్ షాకింగ్ కామెంట్స్

  • జనసేనకు బలం లేదని చెబుతున్నారు
  • వాళ్లే పొత్తుకోసం ప్రయత్నిస్తున్నారు
  • కృష్ణా జిల్లా నేతలతో జనసేనాని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనకు సీట్లు రావని చెబుతున్న నేతలు ఇప్పుడు తమతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని వైసీపీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం కొందరు మధ్యవర్తులతో మాట్లాడిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలవారీగా నేతలతో సమీక్షలు జరుపుతున్న పవన్.. కృష్ణా జిల్లా నేతలతో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

జనసేన ఏపీ అంతటా బలంగా ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ‘జనసేన మాతో కలిసి రావాలని చంద్రబాబు చెప్పినా, తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ మీరు కలిసి పనిచేయాలని చెప్పినా.. అది మన బలాన్ని సూచిస్తున్నాయి. ఓట్ల శాతం ఎంత అనే విషయాన్ని పక్కనపెడతాం. మనకు బలం ఉందని తెలుసు కాబట్టే పొత్తు కోసం వాళ్లంతా ముందుకు వస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
YSRCP
Jagan
Chandrababu
Telugudesam
Krishna District

More Telugu News