Nagarjuna: అక్కినేని బయోపిక్ విషయంలో మనసు మార్చుకున్న నాగార్జున?

  • ఏఎన్నార్ బయోపిక్ ఉండదన్న నాగ్
  • ఇప్పుడు నాగ్ ఆలోచనలో మార్పు
  • సుమంత్ పైనే అందరి దృష్టి    
ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహాలు జరుగుతున్నప్పుడే ఏఎన్నార్ బయోపిక్ కి సంబంధించిన ఊహాగానాలు మొదలయ్యాయి. ఏఎన్నార్ బయోపిక్ గురించిన ప్రశ్నలు నాగార్జునకి ఎదురయ్యాయి. ఏఎన్నార్ జీవితం చాలా సాఫీగా సాగిపోయిందనీ, అందువలన ఆయన బయోపిక్ ను తెరకెక్కిస్తే డ్రామా లేదంటూ ప్రేక్షకులు తిరస్కరించే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాన్ని నాగార్జున వ్యక్తం చేశారు.

అయితే ఇప్పుడు ఏఎన్నార్ బయోపిక్ విషయంలో నాగార్జున మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. సినిమా తీశాక లాభనష్టాల సంగతి అటుంచితే, తరువాత తరాలవారికి ఏఎన్నార్ గురించిన జీవిత విశేషాలను అందిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారట. రీసెంట్ గా ఈ విషయమై నాగార్జున కుటుంబ సభ్యులంతా కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ గా సుమంత్ లుక్ ప్రశంసలు అందుకోవడంతో, బయోపిక్ అంటూ తీస్తే సుమంత్ తోనే తీయవచ్చనే టాక్ వినిపిస్తోంది.
Nagarjuna

More Telugu News