ys jagan: జగన్ తనతో పాటు తమనూ జైలుకు తీసుకెళతారని పెట్టుబడిదారుల భయం: సీఎం చంద్రబాబు

  • ఒకవేళ వైసీపీ అధికారంలోకొస్తే పరిస్థితి అలా ఉంటుంది
  • పెట్టుబడిదారులు కూడా తప్పించుకు పోతారు
  • రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి కాకూడదు 
ఒకవేళ వైసీపీ అధికారంలోకొస్తే కనుక జగన్ తనతో పాటు తమనూ జైలుకు తీసుకెళతారని పెట్టుబడిదారులు భయపడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలోని బోగోలులో నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో పెట్టుబడులు పెట్టేవాళ్లు కూడా తప్పించుకుని పోతారని, ఎవరూ పెట్టుబడులు పెట్టరని, అది, వైసీపీ చరిత్ర అని ఘాటుగా విమర్శించారు.

చాలా మంది పారిశ్రామిక వేత్తలు తమ జీవితాలనే నాశనం చేసుకున్నారని, కొంత మంది అధికారులు వీళ్లు చెప్పిన మాటలు విని వాళ్లు కూడా జైలుకు పోయే పరిస్థితికి వచ్చిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీనే రావాలని ప్రజలు తమ సందేశాల ద్వారా తనకు తెలియజేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. నాశనమవుతున్న వ్యవస్థలను గాడిన పెట్టేందుకు, రాష్ట్రాభివృద్ధి జరగాలంటే ‘నేనే మళ్లీ రావాలి’ అని ప్రజలు తనకు మెస్సేజ్ లు పంపుతున్నారంటూ వాటిని చంద్రబాబు చదివి వినిపించారు. రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి కాకూడదంటే టీడీపీనే మళ్లీ అధికారంలోకి రావాలని, ఈ విషయమై ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు కోరారు.
ys jagan
YSRCP
Telugudesam
Chandrababu
nellore

More Telugu News