ram vilas paswan: మన్మోహన్ సింగ్ కులమేంటో తెలియదు కానీ, మిగతా కాంగ్రెస్ ప్రధానులంతా అగ్రకులస్తులే!: కేంద్ర మంత్రి పాశ్వాన్

  • అగ్రవర్ణాలకు రిజర్వేషన్లకు కాంగ్రెస్ ఎందుకు కల్పించలేకపోయింది
  • యూపీ, బీహార్ లలో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేయబోతోంది
  • ఆర్జేడీకి ఒక్క సీటు కూడా రాదు
మన్మోహన్ సింగ్ కులమేంటో తనకు తెలియదని... దేశాన్ని ఏలిన మిగతా కాంగ్రెస్ ప్రధానులంతా మాత్రం అగ్ర కులానికి చెందినవారేనని ఎల్జేపీ అధినేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. అగ్రకుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లపై పార్లమెంటులో పలు పార్టీలు అభ్యంతరాలను లేవనెత్తిన అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ మేరకు స్పందించారు.

అగ్రవర్ణాలకు రిజర్వేషన్లను కల్పిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందని పాశ్వాన్ తెలిపారు. బీహార్ లో ఆర్జేడీకి ఒక్క సీటు కూడా రాదని... డకౌట్ అవుతుందని చెప్పారు. ఆర్జేడీకి చెందిన రఘువంశ్ ప్రసాద్ సింగ్, జగదానంద్ సింగ్ లాంటి ఎంతో మంది నేతలు అగ్రవర్ణాలకు చెందినప్పటికీ... వారి సామాజికవర్గం నుంచి ఓట్లను సాధించలేరని తెలిపారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల బిల్లు చారిత్రాత్మకమని చెప్పారు.
ram vilas paswan
upper caste
reservations
ebc
congress
nda
ljp

More Telugu News