Andhra Pradesh: మాది కోడి కత్తి పార్టీ అయితే మీది కట్టప్ప కత్తి పార్టీనా.. వెనకాల నుంచి పొడిచేస్తావా?: చంద్రబాబుపై నాని సెటైర్లు

  • పవన్ అమ్మనా బూతులు తిడుతున్నాడు
  • అయినా కలిసిరావాలని బాబు చెబుతున్నారు
  • దమ్మున్నోడు కాబట్టే జగన్ పొత్తులు పెట్టుకోలేదు 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనతో కలవాలని చంద్రబాబు ఇటీవల చెప్పడంపై నాని విమర్శలు చేశారు. ఓవైపు పవన్ కల్యాణ్ రోడ్ల మీద తిరుగుతూ చంద్రబాబును అమ్మనా బూతులు తిడుతుంటే, ఆయన మాత్రం ‘పవన్ నాతో కలిసి రావాలి’ అంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీని ‘కోడి కత్తి పార్టీ’గా అభివర్ణించడంపై కొడాలి నాని ఘాటుగా స్పందించారు. ‘మాది కోడి కత్తి పార్టీ అయితే మీది కట్టప్ప కత్తి పార్టీనా? వెనకాల నుంచి పొడిచేస్తావా నువ్వు?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఎవరో ఒకరి చంక నాకాలి, ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవాలి, దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేయాలని చంద్రబాబు యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ అనుభవం 40 ఏళ్లు అయితే జగన్ వయసు 40 సంవత్సరాలని గుర్తుచేశారు. దమ్మున్న నాయకుడు కాబట్టే జగన్ పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతున్నాడని పేర్కొన్నారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Kodali Nani
Pawan Kalyan
Jana Sena

More Telugu News