Mahesh Babu: మన సినిమా ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నా సార్ !: సుకుమార్ కి మహేశ్ బాబు విషెస్ ట్వీట్

  • ఎన్టీఆర్ కి .. చరణ్ కి హిట్స్ ఇచ్చిన సుకుమార్
  • తదుపరి సినిమా మహేశ్ బాబుతో
  • త్వరలో పూర్తి వివరాలు    
ఎన్టీఆర్ కి 'నాన్నకి ప్రేమతో' .. చరణ్ కి 'రంగస్థలం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సుకుమార్, తన తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ రోజున ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి మహేశ్ బాబు శుభాకాంక్షలు అందజేశాడు. తమ కాంబినేషన్లోని సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నట్టుగా ట్వీట్ చేశాడు.

ముందుగా మహేశ్ బాబు కోసం సుకుమార్ ఒక కథను సిద్ధం చేయగా అది ఆయనకి నచ్చలేదు. దాంతో మరో కథను రెడీ చేసి మహేశ్ బాబును ఒప్పించినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు సుకుమార్ ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ పైనే కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేస్తోన్న మహేశ్ బాబు, ఆ తరువాత సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. 
Mahesh Babu

More Telugu News