Andhra Pradesh: నెల్లూరులో చంద్రబాబు టూర్.. కొత్త ఎయిర్ పోర్టును ప్రారంభించనున్న ఏపీ సీఎం!

  • 60 వేల మందికి భూమి పట్టాల పంపిణీ
  • ఉప్పుటేరు వాగుపై కొత్త వంతెన నిర్మాణం
  • బోగోలులో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు జిల్లాలో బిజీబిజీగా గడపనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా జువ్వలదిన్నెలోని ఉప్పుటేరు వాగుపై నిర్మించిన కొత్త వంతెనను సీఎం ప్రారంభిస్తారు. బోగోలులో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ సందర్భంగా జిల్లాలో శ్రీ పొట్టిశ్రీరాములు విగ్రహం, స్మారకాన్ని ఆవిష్కరిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి దాదాపు 60,000 మంది లబ్ధిదారులకు సీజీఎస్ఎఫ్ భూముల పట్టాలను పంపిణీ చేస్తారు. అనంతరం దగదర్తి ఎయిర్ పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. కాగా, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు, టీడీపీ నేతలు ఆయన్ను ఘనంగా స్వాగతించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Nellore District
tour

More Telugu News