gudipoodi: ఎన్టీఆర్ తన సినిమా స్క్రిప్ట్ ను భార్యకి చదివి వినిపించేవారు: గుడిపూడి శ్రీహరి

  • ఎన్టీఆర్ ను ఉదయాన్నే కలిసేవాడిని
  •  భార్య అంటే ఆయనకి పిచ్చిప్రేమ
  • తెరపై ఆయన పూర్తి భిన్నంగా మారిపోతారు    
తాజా ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మాట్లాడుతూ, ఎన్టీఆర్ తో తనకి గల అనుబంధాన్ని గురించి మాట్లాడుతూ, ఆయనకి సంబంధించిన కొన్ని విషయాలను గురించి ప్రస్తావించారు. "ఎన్టీఆర్ గారిని కలవాలంటే ఉదయం 6 గంటలకి వెళ్లేవాడిని. ఆ సమయంలో ఒక వైపున ఆయన కూర్చుని వుంటే .. ఎదురుగా ఆయన శ్రీమతి బసవతారకం గారు కూర్చుని ఉండేవారు. తన సినిమాలకి సంబంధించిన స్క్రిప్ట్ ను ఆయన ఆమెకి చదివి వినిపించేవారు.

ఆ విషయాన్ని గురించి నేను ఆయన దగ్గర ప్రస్తావిస్తే, ఆమె మంచి క్రిటిక్ అని చెప్పారు. బసవతారకం గారంటే ఎన్టీఆర్ కి పిచ్చి ప్రేమ. ఇక ఎన్టీఆర్ విషయంలో నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి వుంది. బయట చూస్తే ఆయన చాలా గంభీరంగా ఉండేవారు. ఆయనతో చేసే ఆర్టిస్టులంతా భయపడుతూనే చేస్తుంటారా అని అనిపించేది. అలాంటి ఆయన తెరమీద ఎంతో అల్లరి చేస్తూ కనిపిస్తారు. అలా ఆయన మారిపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది" అని చెప్పుకొచ్చారు. 
gudipoodi

More Telugu News