m narayana reddy: వైయస్ ముఖ్య అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మృతి

  • గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణరెడ్డి
  • చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూత
  • నారాయణరెడ్డి వయసు 68 ఏళ్లు
కడప జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణరెడ్డి ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. వారం కిందట చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయనను కుటుంబసభ్యులు చేర్పించారు. పరిస్థితి విషమించడంతో... ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. దివంగత రాజశేఖరరెడ్డికి ముఖ్య అనుచరుడిగా నారాయణరెడ్డికి పేరుంది. 1994లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన గెలుపొందారు. నారాయణరెడ్డికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
m narayana reddy
rayachoti
congress
dead

More Telugu News