aryan rajesh: నాన్నగారు లేకపోవడంతో సినిమాలు నిర్మించడానికి భయపడ్డాం: ఈవీవీ తనయుడు ఆర్యన్ రాజేశ్

  • నాన్నగారు వుంటే ఆ భరోసా వేరు 
  • బాగా ఆలోచించే 'బందిపోటు'ను నిర్మించాం
  • మంచి కథలను ఎంపిక చేసుకుంటాము
ఈవీవీ సత్యనారాయణ పెద్దబ్బాయి ఆర్యన్ రాజేశ్ హీరోగా తెలుగు తెరకి పరిచయమైనా, వరుస సక్సెస్ లను అందుకోలేకపోయాడు. ఆ తరువాత నటనకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన, రేపు విడుదలకానున్న 'వినయ విధేయ రామ' సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించాడు.

ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నాన్నగారు పోయిన తరువాత ఈవీవీ బ్యానర్ పై సినిమాలు చేయడానికి చాలా భయపడ్డాం. ఆయన ఉండివుంటే ఆ భరోసా వేరు. బాగా ఆలోచించే 'బందిపోటు' తీశాము. మేం భయపడినట్టుగానే ఆ సినిమా పరాజయంపాలైంది. దాంతో మళ్లీ ఆలోచనలో పడ్డాము. కానీ ఇకపై మంచి కథలను ఎంపిక చేసుకుని ఈవీవీ బ్యానర్ పై సినిమాలు చేస్తూ వెళతాము. అలాగే వెబ్ సిరీస్ ను కూడా ప్లాన్ చేశాము. నాక్కూడా ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయి" అని చెప్పుకొచ్చాడు. 
aryan rajesh

More Telugu News