New Delhi: న్యూఢిల్లీ-భాగల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ దొంగల హల్‌చల్.. రూ. 25 లక్షల సొత్తు అపహరణ

  • బీహార్‌లోని లఖీసరాయి జిల్లాలో ఘటన
  • గొలుసు లాగి రైలును ఆపిన దొంగలు
  • ప్రయాణికులపై దాడి
ఢిల్లీ నుంచి భాగల్‌పూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఏకంగా రూ. 25 లక్షల విలువైన సొత్తును దోచుకున్నారు. బీహార్‌లోని లఖీసరాయి జిల్లా ధన్నౌరి-కాజ్రా గ్రామాల మధ్య గొలుసు లాగి రైలును ఆపిన దొంగలు బీభత్సం సృష్టించారు. మారణాయుధాలతో ఎస్ 9, ఎస్10 బోగీల్లోకి ప్రవేశించిన దొంగలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. బంగారు నగలు, మొబైల్ ఫోన్లు, నగదును దోచుకున్నారు.

కొందరు ప్రయాణికులు ధైర్యం చేసి దొంగలను ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా వారిపై దాడిచేసి గాయపరిచారు. ఓ ప్రయాణికుడు ట్విట్టర్ ద్వారా దోపిడీ సమాచారాన్ని రైల్వే పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.
New Delhi
bhagalpur
Express rail
Bihar
Robbery
RPF

More Telugu News