Chandrababu: చంద్రబాబును విమర్శించే క్రమంలో జగన్ ‘గోవిందా’ నామస్మరణ

  • బాబు వస్తే జాబు వస్తుందన్న హామీని గాలికొదిలేశారు
  • యువత నిరాశ, నిస్పృహలో ఉన్నారు
  • ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు గోవిందా
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, బాబు వస్తే జాబు వస్తుందన్న హామీతో నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఆ హామీని గాలికొదిలేశారని విమర్శించారు.

చంద్రబాబు అధికారంలోకైతే వచ్చారు కానీ, ఉద్యోగాలు మాత్రం రాలేదని యువత అంటున్నారని, ఉద్యోగాలు రాక నిరాశ, నిస్పృహలో యువత ఉన్నారని దుయ్యబట్టారు. ‘ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు గోవిందా. గోపాలమిత్ర, సాక్షర భారత్, ఆయుష్ ఉద్యోగాలు గోవిందా. మధ్యాహ్న భోజన కార్మికుల ఉద్యోగాలు గోవిందా’ అంటూ బాబుపై జగన్ వ్యంగ్యంతో కూడిన విమర్శలు చేశారు.
Chandrababu
Telugudesam
YSRCP
Jagan
Srikakulam District
ichapuram
youth

More Telugu News