nithya menon: జయలలిత బయోపిక్ కోసం భారీ సెట్

  • జయలలితగా నిత్యామీనన్ 
  • రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ 
  • వచ్చే నెల 24 నుంచి షూటింగ్  
హిందీలో మాదిరిగానే తెలుగు .. తమిళ భాషల్లో బయోపిక్ లను తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలా తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితచరిత్రను తెరపైకి తీసుకురావడానికి కొంతమంది దర్శకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. గతంలో దర్శకుడు మిస్కిన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రియదర్శిని, 'ది ఐరన్ లేడీ' టైటిల్ తో జయలలిత బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. జయలలిత పాత్రకి గాను నిత్యా మీనన్ ను .. ఎంజీఆర్ పాత్రకి గాను మలయాళ నటుడు సుకుమార్ ను .. శశికళ పాత్రకి గాను వరలక్ష్మీ శరత్ కుమార్ ను  ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. అందుకోసం ఇక్కడ భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. వచ్చేనెల 24వ తేదీ నుంచి ఇక్కడ రెగ్యులర్ గా షూటింగ్ జరగనుంది. 
nithya menon
varalakshmi sarath kumar

More Telugu News