bhanuchander: వైసీపీలో చేరిన సినీనటుడు భానుచంద‌ర్

  • పాదయాత్ర చివరి రోజున జగన్ ను కలిసిన భానుచందర్
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్
  • వైసీపీ విజయం కోసం తన వంతు కృషి చేస్తానన్న భానుచందర్
ప్రముఖ సినీ నటుడు భానుచందర్ వైసీపీలో చేరారు. ప్రజాసంకల్ప యాత్ర చివరి రోజున వైసీపీ అధినేత జగన్ ను కలిసిన భానుచందర్... ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా భానుచందర్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం భానుచందర్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పార్టీ అప్పజెప్పే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.
bhanuchander
jagan
ysrcp
tollywood

More Telugu News