NTR: ‘కథానాయకుడు’ ఎంతటి చరిత్ర సృష్టిస్తుందో చెప్పలేను: పరుచూరి గోపాలకృష్ణ

  • ఎన్టీఆర్ రూపంలో బాలయ్య మరో చరిత్ర సృష్టించారు
  • ఆ మహానుభావుడి ఆర్ద్రతతోనే నా కళ్లు చెమ్మగిల్లాయి
  • ఎన్టీఆర్ ని చూడని వాళ్లకు ఆయన్ని చూపించిన ఘనత బాలయ్యదే
‘యన్.టి.ఆర్’ చిత్రం తొలి భాగం ‘కథానాయకుడు’ ఎంతటి చరిత్ర సృష్టిస్తుందో తాను చెప్పలేనని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఈరోజు విడుదలైన ‘యన్.టి.ఆర్’ చిత్రాన్ని హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ కుటుంబసభ్యులతో కలిసి ఆయన వీక్షించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ సృష్టించిన చరిత్రను ఎన్టీఆర్ రూపంలో బాలయ్య మరో చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. ఈ

 చిత్రం ద్వారా ఇవాళ ఆ మహాపురుషుడి చరిత్రను అద్భుతంగా ఆవిష్కరించారని అన్నారు. ఆ మహానుభావుడిని చూస్తుంటే ఆర్ద్రతతో తన కళ్లు చెమ్మగిల్లాయని, ఈ చిత్రం ద్వారా బాలయ్య గొప్ప చరిత్రను సృష్టించాడని ప్రశంసించారు. ఈ చిత్రంలో తనకు బాలయ్య కనిపించలేదని, ఎన్టీఆర్ ని చూస్తున్నట్టే ఉందని అన్నారు. ఎన్టీఆర్ ని ఎరుగని వాళ్లకు ఎన్టీఆర్ ని చూపించిన ఘనత బాలయ్యకే దక్కుతుందని, బసవతారకం పాత్రను అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు. 
NTR
kathanayakudu
Tollywood
paruchuri gopala krishna
Balakrishna
Hyderabad

More Telugu News