Pawan Kalyan: 'క్షేత్ర ఫర్ జనసేన' ఏర్పాటు చేశాం: పవన్ కల్యాణ్

  • మరింత దూకుడు పెంచిన జనసేన
  • గ్రామస్థాయిలో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడమే ఈ టీమ్ ల లక్ష్యమన్న జనసేనాని
  • గ్రామస్తులతో ఆత్మీయ సమావేశాల నిర్వహణ 
ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన పార్టీ దూకుడు పెంచుతోంది. గత కొన్ని రోజులుగా జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఇప్పుడు గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా క్షేత్ర ఫర్ జనసేన టీమ్ లను ఏర్పాటు చేయబోతున్నట్టు పవన్ తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజలను కలిసి, పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడమే ఈ టీమ్ ల లక్ష్యమని చెప్పారు. గ్రామస్తులతో ఆత్మీయ సమావేశాలను కూడా క్షేత్ర ఫర్ జనసేన సభ్యులు నిర్వహిస్తారని తెలిపారు.
Pawan Kalyan
janasena
kshetra for janasena

More Telugu News