black magic: పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.. తనపై చేతబడి జరిగిందన్న సోహైల్

  • గతంలోనూ ఇలానే ప్రవర్తించిన సోహైల్
  • గాయంతో ఇంటిముఖం
  • దక్షిణాఫ్రికాలో సిరీస్ కోల్పోయిన పాక్
పాకిస్థాన్ క్రికెటర్ హ్యారిస్ సోహైల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై చేతబడి జరిగిందని ఆరోపించాడు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మూడు టెస్టు సిరీస్‌లో తొలి రెండింటిలో ఓడిపోయిన పాకిస్థాన్‌ ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయింది. మూడో టెస్టుకు ముందు ఇప్పుడు మరో కష్టం వచ్చిపడింది. ఆ జట్టు బెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌మన్ అయిన హ్యారిస్ సోహైల్ గాయం కారణంగా జట్టునుంచి తప్పుకుని స్వదేశం చేరుకున్నాడు. స్వదేశం చేరుకున్న సోహైల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చేతబడి కారణంగా తాను విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు చెప్పాడు. దక్షిణాఫ్రికా నుంచి పాక్ చేరుకున్న సోహైల్ రిహాబిలేటషన్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉండగా, తన స్వగ్రామమైన సియోల్‌కోట్‌కు వెళ్లాడు.

సోహైల్ ఇలా ప్రవర్తించడం ఇదేమీ కొత్తకాదు. 2015లో న్యూజిలాండ్ టూర్‌లోనూ ఇలాగే ప్రవర్తించాడు. తనకు కేటాయించిన హోటల్ గదిని ఖాళీ చేశాడు. తనను అతీంద్రియ శక్తులు నియంత్రిస్తున్నాయని పేర్కొన్నాడు. ఆ తర్వాత గాయంతో జట్టు నుంచి వైదొలిగాడు. మరోవైపు, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, యూఏఈ, న్యూజిలాండ్‌లలో బౌలర్లను చితకబాది పరుగులను అలవోకగా సాధించిన హ్యారిస్ జట్టు నుంచి తప్పుకోవడం జట్టుకు నష్టమేనని పీసీబీ భావిస్తోంది.
black magic
Pakistan
Crime News
south africa
Haris Sohail
Sialkot

More Telugu News