Washington: కుమార్తెను ఈడ్చుకుంటూ ఎయిర్‌పోర్టులోకి తీసుకెళ్లిన తండ్రి.. వీడియో వైరల్

షార్ట్స్‌లో చూడండి
కుమార్తె హూడీ (స్వెట్టర్ లాంటి వాటికి ఉండే టోపీ లాంటింది) పట్టుకుని లగేజీని ఈడ్చుకెళ్లినట్టు విమానాశ్రయంలో లాక్కెళ్తున్న ఓ తండ్రి వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని వాషింగ్టన్ డ్యూల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. న్యూ ఇయర్ రోజున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. తండ్రి తనను లాక్కెళ్తున్నా ఆ చిన్నారి అరవడం కానీ,  భయపడడం కానీ చేయలేదు. చేతిలో లగేజీతో ఆమె సోదరి వారిని అనుసరిస్తోంది. వీడియో వైరల్ కావడంతో తండ్రి స్పందించాడు. కుమార్తె తన వెనక నడవడం ఇబ్బందిగా అనిపించిందని అందుకే అలా లాక్కెళ్లానని వివరణ ఇచ్చాడు. 
Go Back to Shorts
Washington
Dulles International Airport
New Year
dragging
daughter
hoodie

More Telugu News