Balakrishna: బాలకృష్ణను టార్గెట్ చేస్తూ నాగబాబు సంచలనం.. ‘ఎర్రోడి వీరగాథ’ షార్ట్ ఫిలిం విడుదల

  • గతంలోని బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్
  • మూడు నిమిషాల నిడివి
  • సోషల్ మీడియాలో ప్రకంపనలు
గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ వరుస వీడియోలు విడుదల చేస్తున్న మెగాబ్రదర్ నాగబాబు తాజాగా ‘ఎర్రోడి వీరగాథ’ పేరుతో ఏకంగా షార్ట్‌ఫిల్మ్‌నే విడుదల చేశారు. గతంలో ఓ ఆడియో ఫంక్షన్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలా.. కడుపైనా చేయాలా’ అన్న వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఈ షార్ట్‌ఫిల్మ్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలకృష్ణ ప్రతిష్ఠాత్మకంగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ నేడు విడుదల కానున్న నేపథ్యంలో నాగబాబు ‘ఎర్రోడి వీరగాథ’ను విడుదల చేసి సంచలనం సృష్టించారు.  

‘ఎర్రోడి వీరగాథ’ మూడున్నర నిమిషాల నిడివి ఉంది. ఇందులోని ఓ వ్యక్తిని ఆడవాళ్లు పట్టుకుని కొడుతుంటారు. వారిని అడ్డుకున్న నాగబాబు ఎందుకలా కొడుతున్నారని ఆ వ్యక్తిని ప్రశ్నిస్తాడు. దానికి అతడు చెప్పిన సమాధానం విని నాగబాబు ఆశ్చర్యపోతాడు. ‘ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలా.. కడుపైనా చేయాలా’ అని పెద్దలు చెప్పారని, అందుకే ముద్దు అడిగానని అతడు చెబుతాడు. దీంతో షాకైన నాగబాబు ఆడవాళ్లను పిలిచి మరీ అతడిని చితక్కొట్టిస్తాడు.
Balakrishna
Nagababu
Tollywood
Errodi veeragatha
Shortfilm
Chiranjeevi

More Telugu News