YSRCP: సొంత ప్రెస్ ఉందని వైసీపీ ఇష్టానుసారం పుస్తకాలు ప్రింట్ చేస్తోంది: ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

  • శ్వేతపత్రాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇదంతా
  • అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
  • శ్వేతపత్రాలపై అనుమానాలుంటే ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించొచ్చు
ఏపీ సీఎం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తూ ‘అవినీతి చక్రవర్తి’ పేరిట   వైసీపీ ఓ పుస్తకం ముద్రించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ, సొంత ప్రెస్ ఉందని చెప్పి వైసీపీ నేతలు తమ ఇష్టానుసారం పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారని విమర్శించారు.

ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రతిపక్ష నేతలు ఈ పుస్తకం విడుదల చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై అనుమానాలు ఉంటే ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించవచ్చని, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఆరోపణలు చేయాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా ఆయన విమర్శలు చేశారు. ఏపీపై మోదీ కక్ష గట్టి నిధులు విడుదల చేయడం లేదని అన్నారు.
YSRCP
ap planning commission
kutumbarao

More Telugu News