Rahul Gandhi: అలోక్ వర్మ విషయంలో న్యాయం జరిగింది: రాహుల్ గాంధీ

  • సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ హర్షం
  • ‘రాఫెల్’పై దర్యాప్తు చేస్తారనే అలోక్ ను తప్పించారు
  • ‘రాఫెల్’ విషయంలో ఇకపై ఏం జరుగుతుందో చూడాలి
సీబీఐ నుంచి బలవంతంగా సెలవుపై బయటకు వెళ్లిన డైరెక్టర్ అలోక్ వర్మకే తిరిగి బాధ్యతలు అప్పగించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ, అలోక్ వర్మ విషయంలో న్యాయం జరిగిందని అన్నారు. సీబీఐ డైరెక్టర్ ని అర్ధరాత్రి ఒంటిగంటకు తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా రాహుల్ ప్రస్తావించారు. రాఫెల్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తారనే అలోక్ వర్మను ఆ పదవి నుంచి తప్పించారని విమర్శించారు. రాఫెల్ కుంభకోణం విషయంలో ఇకపై ఏం జరుగుతుందో చూడాలని రాహుల్ వ్యాఖ్యానించారు.
Rahul Gandhi
CBI
Alok Varma

More Telugu News