Andhra Pradesh: కేంద్రం చేపట్టిన పోలవరం ప్రాజెక్టులో మీరు బ్రోకరా? లేక కాంట్రాక్టరా?: చంద్రబాబు, లోకేశ్ పై కన్నా సెటైర్లు

షార్ట్స్‌లో చూడండి
సోమవారం-పోలవరం అనీ, బస్సు యాత్రలని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నాటకాలు ఆడారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇప్పుడు ప్రపంచ రికార్డులు అంటూ ఆర్భాటం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు కుచ్చుటోపి పెట్టడానికి ప్రజా ధనాన్నే వృథా చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘@ncbn @naralokesh..సోమవారం-పోలవరం అంటూ, బస్సుయాత్రలంటూ, ప్రారంభోత్సవాలంటూ నాటకాలాడారు. ఇప్పుడు వరల్డ్ రికార్డులంటూ ఆర్భాటం. ప్రజలకు కుచ్చు టోపి పెట్టటానికి ప్రజల సొమ్మునే వృధా చేస్తున్న మీకు సూటి ప్రశ్న..కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పోలవరంలో మీ పాత్ర ఏంటి? బ్రోకరా? కాంట్రాక్టరా?’ అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Nara Lokesh
Telugudesam
kanna lakshmi narayana
BJP

More Telugu News