hanu raghavapoodi: టీవీలో నా సినిమా చూస్తూ నేను బాధపడకూడదు: దర్శకుడు హను రాఘవపూడి
- సెట్లో నేను షూటింగ్ చేయలేను
- అవుట్ డోర్ షూటింగ్ ఎక్కువ వుంటుంది
- మనం పోతాంగానీ సినిమా ఎప్పటికీ వుంటుంది
ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో హను రాఘవపూడి సిద్ధహస్తుడు. ఇటీవలే ఆయన 'పడి పడి లేచె మనసు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి కూడా ప్రేమకథా చిత్రాలనే ఎక్కువగా తెరకెక్కిస్తూ వస్తోన్న హను రాఘవపూడి, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
"హను రాఘవపూడి ఆర్టిస్టుల నుంచి కావలసిన నటనను పిండుకుంటాడు అనే మాటలో నిజం లేదు. అసలు ఆ మాటే నాకు ఇష్టం వుండదు. పాత్ర స్వభావాన్ని ఆర్టిస్టులకు అర్థమయ్యేలా చెబుతాను .. వాళ్లు చేసిన దాంట్లో ఏది బాగుంది అనేది నేను చెబుతుంటాను. నేను సెట్లో షూటింగ్ చేయలేను .. నా కథను బట్టి అవుట్ డోర్ లొకేషన్స్ లోనే ఎక్కువగా చిత్రీకరణ చేయవలసి ఉంటుంది.
సెట్లో సినిమా చేయాలంటే నా కంటే బ్యాడ్ గా ఎవరూ తీయలేరు. అనుకున్నది అనుకున్నట్టుగా తీయలేకపోతే నేను చాలా బాధపడతాను. షాట్ విషయంలో నేను రాజీ పడలేను .. ఎందుకంటే మనం పోతాంగానీ సినిమా ఎప్పటికీ ఉంటుంది. టీవీలో నా సినిమా వచ్చేటప్పుడు .. సరిగ్గా తీయలేకపోయానే అని నేను బాధపడకూడదు" అని చెప్పుకొచ్చాడు.