Andhra Pradesh: ప్రజలు సంకరజాతి వాళ్లా.. మీరెంత అహంకారంతో మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా?: బాలయ్యపై నాగబాబు ఆగ్రహం

  • జనసేనను సంకరజాతి పార్టీ అన్నారు
  • బాలయ్యకు కులాలు, జాతులపై గౌరవం లేదు
  • మా మనోభావాలు దెబ్బతిన్నాయి
ఈ మధ్యన కొన్ని అలగా, బలగా పార్టీలు, సంకరజాతి పార్టీలు పుట్టుకొచ్చాయని నందమూరి బాలకృష్ణ జనసేనపై పరోక్ష కామెంట్లు చేశారని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. ఓ కార్యక్రమం సందర్భంగా బాలయ్య ‘అల్లుడు పింజారి.. మరదలు మరాఠి’ అని అన్నారనీ, ఇతర కులాలు, జాతులపై ఆయనకు ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. టీడీపీకి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ మాట్లాడినందుకు జనసేన కోసం పనిచేసేవారిని అలగా బలగా జనం అని విమర్శించారని గుర్తుచేశారు. బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు ఐదో కామెంట్ పేరుతో ఓ వీడియోను ఈరోజు విడుదల చేశారు.

టీడీపీలో అయినా, జనసేనలో అయినా ఎస్సీ,ఎస్టీ, కమ్మ, కాపు, వైశ్య కులాలకు చెందినవారు ఉంటారని నాగబాబు స్పష్టం చేశారు. ‘ప్రజలను సంకరజాతి మనుషులు అన్నారే.. మీరు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారో మీకు ఎవరూ చెప్పలేదా? ఈ వ్యాఖ్యలపై కూడా మేం స్పందించలేదు. మీ వ్యాఖ్యలతో ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయి.

మా పార్టీలోనూ రెడ్లు, కమ్మ, కాపులు ఉన్నారు. మనసుకు బాధగా అనిపించినా మేం స్పందించలేదు’ అని నాగబాబు వ్యాఖ్యానించారు. ఒకరితో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. త్వరలోనే మరో వీడియోను రిలీజ్ చేసి ఈ వివాదానికి ముగింపు పలుకుతానని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Jana Sena
Telugudesam
Balakrishna
nagababu
5th video

More Telugu News