Pulivendula: పులివెందులలో జగన్ పై పోటీకి దిగేది ఎవరో చెప్పేసిన చంద్రబాబు!

  • సతీశ్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు
  • పులివెందులలో 20 ఏళ్లుగా పోటీ చేస్తున్న సతీశ్ రెడ్డి
  • మరోసారి కూడా అతనేనన్న చంద్రబాబు
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ పై పోటీ పడేది ఎవరో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తేల్చేశారు. శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్, గతంలో పలుమార్లు వైఎస్ కుటుంబానికి పోటీగా నిలిచిన సతీశ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు.

 వైఎస్ రాజశేఖరరెడ్డిపై గతంలో సతీశ్ రెడ్డి పోటీ పడ్డారు. ఆపై జగన్ పైనా పోటీకి దిగారు. గడచిన 40 సంవత్సరాల వ్యవధిలో వచ్చిన అన్ని ఎన్నికల్లోనూ పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి అండగా నిలిచిందన్న విషయం తెలిసిందే. వైఎస్ కంచుకోటలో గత 20 ఏళ్లుగా సతీశ్ రెడ్డే పోటీకి దిగుతున్నారు. పోటీచేసిన ప్రతిసారీ ఆయన ఓటమి పాలవుతూనే ఉన్నా, పట్టువదల్లేదు. మరోసారి కూడా సతీశ్ రెడ్డినే పులివెందులలో నిలపాలని టీడీపీ అధినేత నిర్ణయించారు.
Pulivendula
Jagan
Chandrababu
Satish Reddy

More Telugu News