Tamilnadu: గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వింటూ... తండ్రి, బాబాయ్ ల నీచపు పనిని బయటపెట్టిన బాలిక!

షార్ట్స్‌లో చూడండి
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి అతను. తనను పెంచుతున్న తండ్రి చేస్తున్న పనులు నీచమైనవని కూడా తెలియని వయసులో ఉందా బాలిక. ఆరో తరగతిలోకి వచ్చినప్పటి నుంచి తండ్రి తనపై అత్యాచారం చేస్తుంటే, అదేంటో కూడా తెలుసుకోలేకపోయిన ఆ అమాయకురాలిని చూసిన ఇద్దరు బాబాయిలు కూడా అదే పని చేశారు. రెండేళ్లు ఇలాగే గడిచిపోగా, స్కూల్ లో లైంగిక వేధింపులపై బాలికలకు అవగాహన కల్పిస్తున్న వేళ, ఇంతకాలమూ తనపై జరిగిన అత్యాచారాల గురించి అధికారులకు చెప్పిందా బాలిక.

ఈ ఘటన తమిళనాడు, కోయంబత్తూరులో జరుగగా, బాలిక మాటలు విని దిగ్భ్రాంతికి గురైన అధికారులు, వెంటనే స్పందించారు. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి, కన్న బిడ్డపై అత్యాచారం చేస్తే, దాన్ని చూసిన అతని సోదరులు కూడా అదే పని చేయడం, రెండేళ్లుగా ఈ దుర్మార్గం సాగుతోందని తెలుసుకున్న పోలీసులు బాలిక తండ్రి, ఓ చిన్నాన్నను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న రెండో చిన్నాన్న కోసం గాలింపు చేపట్టారు. బాలికను సంరక్షణా కేంద్రానికి పంపించామని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.
Go Back to Shorts
Tamilnadu
Father
Daughter
Harrasment
Rape

More Telugu News