Andhra Pradesh: కర్నూలు జిల్లాలో ఎయిర్ పోర్టు.. నేడు ప్రారంభించనున్న ఏపీ సీఎం చంద్రబాబు!

  • కేన్సర్ ఆసుపత్రి, ఫార్మా క్లస్టర్ కు శంకుస్థాపన
  • పారిశ్రామికవేత్తలు, రైతులతో ముఖాముఖి
  • అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత జిల్లాలో విమానాశ్రయానికి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సౌరవిద్యుత్ కోసం అల్ట్రా మెగా సోలార్ పార్క్ ను ప్రారంభిస్తారు. అనంతరం స్టేట్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్, ఫార్మా క్లస్టర్ కు సీఎం భూమిపూజ చేయనున్నారు.

ఆ తర్వాత ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో జరిగే ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా కోసిగి ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగే జన్మభూమి కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఢిల్లీకి బయలుదేరివెళతారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Kurnool District
tour

More Telugu News