Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  అప్పుడప్పుడు ఐటెం పాటల్లో మెరుస్తున్న కథానాయిక తమన్నా తానెందుకు అలాంటి పాటల్లో నటిస్తున్నదీ తాజాగా వెల్లడించింది. "మొదటి నుంచీ నా డ్యాన్సులకి మంచి పేరు వచ్చింది. అయితే, కథానాయికగా నటించే చిత్రాలలో డ్యాన్సులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండకపోవచ్చు. అదే ఐటెం పాటల్లో అయితే మంచి ప్రాధాన్యత వుంటుంది. ఆ విధంగా ఆ కోరిక తీర్చుకోవడానికే అలాంటి పాటల్లో నటిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.
*  ఆమధ్య అకాల మృత్యువాత పడిన ప్రముఖ నటి శ్రీదేవిపై ఓ బయోపిక్ ను నిర్మించడానికి ఆమె భర్త బోనీకపూర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తారని వార్తలొస్తున్నాయి. అయితే, ఇందులో శ్రీదేవి పాత్రను పోషించేది ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.  
*  'పెళ్లిచూపులు' చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ కుర్రాడు నటించే చిత్రం షూటింగ్ నిన్న మొదలైంది. నూతన దర్శకుడు శేష సింధూరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో '96' ఫేం వర్ష హీరోయిన్ గా నటిస్తోంది.
Go Back to Shorts
Thamanna
shreedevi
Bonykapoor
Raj

More Telugu News