KA paul: వెయ్యి మందిని చేర్పించండి.. మూడువేలు తీసుకోండి!: కేఏ పాల్ ఆఫర్

  • గెలిపిస్తే నియోజకవర్గానికి రూ.100 కోట్లు ఇస్తా 
  • అన్ని మతాలవారు భయంతో బతుకుతున్నారు
  • 20 రోజుల్లో ప్రభంజనం సృష్టిస్తుంది
తమ పార్టీని గెలిపిస్తే నియోజకవర్గానికి రూ.100 కోట్లు చొప్పున విరాళం ఇస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. నేడు మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రానున్న 20 రోజుల్లో తమ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. పెద్ద నోట్ల ముసుగులో దేశంలో భారీ అవినీతి జరిగిందని కేఏ పాల్ ఆరోపించారు. అన్ని మతాల వారు భయంతో బతుకున్నారని పేర్కొన్నారు. పార్టీలో వెయ్యి మందిని చేర్పించిన వారికి రూ.3 వేల చొప్పున ఇస్తానని కేఏ పాల్ ప్రకటించారు.
KA paul
Prajashanthi party
Andhra Pradesh

More Telugu News