Chandrababu: నా కుటుంబంపై చేసిన విమర్శలు మోదీ దిగజారుడుతనానికి నిదర్శనం: చంద్రబాబు

  • నమ్మకద్రోహం వల్లే బయటకు వచ్చాం
  • రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు
  • కావాలనే జగన్ కేసులో జోక్యం
  • ఐటీ, సీబీఐ దాడుల పేరుతో బెదిరింపులు
తన కుటుంబంపై చేసిన విమర్శలు ప్రధాని మోదీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. నేడు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా రూ.200 కోట్లతో నిడదవోలులో నిర్మించనున్న వంతెనకు శంకుస్థాపన, అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.

విభజన హామీలు అమలు చేయకపోవడంతో పాటు ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా నమ్మకద్రోహానికి పాల్పడటం వల్లే తాము ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నప్పటికీ కేంద్రం మాత్రం నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై జరిగిన దాడి కేసులో కావాలనే కేంద్రం జోక్యం చేసుకుంటోందని చంద్రబాబు విమర్శించారు. విభజన హామీల అమలు కోసం పోరాటం చేస్తుంటే ఐటీ, సీబీఐ దాడుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Chandrababu
Narendra Modi
Jagan
KCR
Andhra Pradesh
West Godavari District

More Telugu News