Australia: జాతి గర్వించదగిన క్షణం ఇది: టీమిండియా విజయంపై మహేష్ బాబు

  • ఆసీస్ గడ్డపై అద్భుత విజయం
  • 2-1తో సిరీస్‌ను దక్కించుకున్న టీమిండియా
  • అభినందనలు తెలిపిన మహేష్
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో ద‌క్కించుకున్న విషయం విదితమే. సిడ్నీలో జ‌రిగిన చివ‌రి టెస్ట్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్ భార‌త్ వ‌శమైంది. ఆసీస్ గడ్డపై టీమిండియా ఈ ఘన విజయాన్ని సాధించడంతో దేశమంతా కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది.

సూపర్‌స్టార్ మహేష్ బాబు టీమిండియా సాధించిన విజయంపై ట్విట్టర్ వేదికగా ఆనందోత్సాహాలు ప్రకటించారు. ‘అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు టీం ఇండియాకు అభినందనలు. జాతి మొత్తం నిజంగా గర్వించదగిన క్షణం’ అంటూ మహేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.  
Australia
Mahesh Babu
Virat kohli
India

More Telugu News