piyush goyal: కనీస పరిజ్ఞానం లేకుండా గోయల్ మాట్లాడారు: సుజనా చౌదరి ధ్వజం

  • కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని ఎందుకు ఇవ్వలేదు?
  • వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను వెనక్కి ఎందుకు తీసుకున్నారు?
  • రాష్ట్రం అవినీతికి పాల్పడినట్టైతే.. నాలుగున్నరేళ్లుగా నిద్రపోతున్నారా?
ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు కేంద్రంపై అనవసర విమర్శలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో పట్టిన గతే... ఏపీలో కూడా టీడీపీకి పడుతుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, గోయల్ పై టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. కనీస పరిజ్ఞానం కూడా లేకుండా గోయల్ మాట్లాడారని ఆయన అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను మళ్లీ వెనక్కి ఎందుకు తీసుకున్నారని అడిగారు. అమరావతి నిర్మాణానికి ఇప్పటి వరకు నిధులను ఇవ్వలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో యూపీఏకు పట్టిన గతే రానున్న ఎన్నికల్లో ఎన్డీయేకి పడుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్టైతే... నాలుగున్నరేళ్లుగా కేంద్రం నిద్రపోతోందా? అని ప్రశ్నించారు.
piyush goyal
Sujana Chowdary
Telugudesam
bjp

More Telugu News