Jagan: తిరుమలలో జగన్ పై దాడికి చంద్రబాబు కుట్ర.. వైసీపీ పేరుతో అలజడి సృష్టించేందుకు ప్లాన్!: భూమన సంచలన ఆరోపణలు

  • సంఘ విద్రోహక శక్తులు రంగంలోకి
  • దాడిపై మాకు సమాచారం అందింది
  • హిందువులు గమనించాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రను ఆరంభం నుంచి అడ్డుకునేందుకు కుట్రలు సాగాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ జగన్ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావొస్తుందని వ్యాఖ్యానించారు. అయితే విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం నేపథ్యంలో జగన్ పై మరోసారి దాడికి కుట్రలు జరుగుతున్నాయని భూమన ఆరోపించారు.

ఇచ్ఛాపురంలో ఈరోజు భూమన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసంకల్ప యాత్రకు ముందుగా జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారని తెలిపారు. ఇచ్ఛాపురంలో పాదయాత్ర పూర్తయిన వెంటనే మరోసారి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారని అన్నారు. ఈ సందర్భంగా జగన్ పై దాడి చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర పన్నుతున్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలే తమకు చెప్పారన్నారు.

సంఘ విద్రోహక శక్తులతో దాడిచేయించి ‘జై జగన్’ నినాదాలు చేయించేందుకు ఆయన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ముసుగులో అలజడి సృష్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రతీ హిందువు ఈ కుట్రలను గమనించాలని సూచించారు. పాదయాత్రలో భాగంగా జగన్ కోటిన్నర మంది ప్రజలను కలుసుకున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతీసారీ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేవారని గుర్తుచేశారు.
Jagan
Andhra Pradesh
attack
Tirumala
paln
Telugudesam

More Telugu News