Kakinada: చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా నేత!

  • కాకినాడలో 4న ప్రసంగించిన చంద్రబాబు
  • బీజేపీ నేతలకు సిగ్గులేదా? అని ప్రశ్నించారు
  • ఫినిష్ అయిపోతారని హెచ్చరించారు
  • రక్షణ కల్పించాలని లక్ష్మీ ప్రసన్న ఫిర్యాదు
ఈ నెల 4న కాకినాడలో సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగిస్తూ, బీజేపీ మహిళా కార్పొరేటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్‌ సాలిగ్రామ లక్ష్మీప్రసన్న సర్పవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు సిగ్గు లేదని, ఫినిష్ అయిపోతారని చంద్రబాబు హెచ్చరించారని, సీఎంవల్ల, టీడీపీ నేతల వల్ల తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆమె కోరారు. బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య, ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు తదితరులతో కలసి పోలీసులను ఆశ్రయించిన ఆమె, రాష్ట్రానికి మోసం చేసిన ప్రధానిని తాము వెనకేసుకొస్తున్నామని చంద్రబాబు అన్నారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
Kakinada
East Godavari District
Chandrababu
Police
Narendra Modi
BJP

More Telugu News