Telangana: హైదరాబాద్ లో మళ్లీ చైన్ స్నాచర్ల కలకలం.. దొంగను పట్టుకుని చావగొట్టిన మహిళ!

  • చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • బైక్ నుంచి కిందపడిపోయిన దొంగ
  • చావబాది పోలీసులకు అప్పగించిన కుటుంబసభ్యులు
తెలంగాణలోని హైదరాబాద్ లో మరోసారి చైన్ స్నాచర్ల కలకలం చెలరేగింది. నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు దుండగులు ఈరోజు ఉదయం ఓ మహిళ మెడ నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించారు. దీంతో బాధితురాలు చైన్ ను గట్టిగా పట్టుకోవడంతో రెండో వ్యక్తి కిందపడిపోయాడు. ఈ సందర్భంగా బాధిత మహిళ కేకలు వేయడంతో అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు సదరు దొంగను చితకబాదారు.

అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనలో బైక్ నడుపుతున్న రెండో వ్యక్తి ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇటీవల 12 గంటల వ్యవధిలో 10 స్నాచింగ్ లతో దొంగలు హైదరాబాద్ ను హడలెత్తించిన సంగతి తెలిసిందే.
Telangana
Hyderabad
chain
snaching
chaitanyapuri
Police

More Telugu News