New Delhi: పెంపుడు కుక్కపై రాళ్లు వేశాడని... యువకుడిని కాల్చి చంపిన యజమాని!

షార్ట్స్‌లో చూడండి
తన పెంపుడు కుక్కపై రాళ్లు విసిరాడన్న ఆగ్రహంతో, ఓ యువకుడిని కాల్చిచంపాడో వ్యక్తి. ఈ ఘటన న్యూఢిల్లీలోని వెల్ కమ్ కాలనీలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 30 సంవత్సరాల అఫ్తాక్ అనే యువకుడు, నడిచి వెళుతుంటే, మెహతాబ్ అనే వ్యక్తి పెంపుడు కుక్క అరిచింది. అఫ్తాక్ ను కరిచేందుకు ప్రయత్నించింది. దీంతో అఫ్తాక్ రోడ్డుపై ఉన్న కొన్ని రాళ్లు తీసుకుని దానిపైకి రువ్వాడు. దీన్ని గమనించిన మెహతాబ్, ఇంట్లోకి వెళ్లి, తన తుపాకిని తెచ్చి, అఫ్తాక్ పై కాల్పులు జరిపాడు. ఆపై అఫ్తాక్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఈ విషయంలో కేసు నమోదు చేశామని, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారి అతుల్ ఠాకూర్ వెల్లడించారు.
Go Back to Shorts
New Delhi
Dog
gun
Murder

More Telugu News