దారుణాతి దారుణం.. తల్లిని చంపి రక్తం తాగిన కొడుకు!
- క్షుద్రపూజల మత్తులో దారుణం
- కళ్లారా చూసి వణికిపోయిన హతురాలి స్నేహితురాలు
- నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
తల్లి సమరియా (50)ను ఆమె కుమారుడు దిలీప్ యాదవ్ నరుకుతున్నప్పుడు చూసిన ఆమె స్నేహితురాలు సమీరన్ యాదవ్ భయంతో వణికిపోయింది. ఎవరికి చెప్పాలో, చెబితే ఏమవుతుందో తెలియక భయంతో ఆ భయంకర నిజాన్ని తనలోనే దాచుకుంది. చివరికి ఈ నెల 3న ధైర్యం కూడగట్టుకుని తొలుత తన కుటుంబ సభ్యులకు చెప్పింది. అనంతరం గ్రామ పెద్దలకు, వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న దిలీప్ కోసం గాలింపు మొదలుపెట్టారు.