Andhra Pradesh: దేశంలోనే తొలిసారిగా సూళ్లూరుపేటలో భారీ తెరతో మల్టీప్లెక్స్‌.. ప్రపంచంలోనే మూడోది!

  • రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్
  • 106 అడుగుల వెడల్పుతో భారీ తెర
  •  అత్యాధునిక సౌకర్యాలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ మల్టీప్లెక్స్ రూపుదిద్దుకోబోతోంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఇందుకు వేదిక కానుంది. చెన్నై-కోల్‌కతా రహదారిపై సూళ్లూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో పిండిపాళెం వద్ద దేశంలోనే భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. 106 అడుగుల వెడల్పుతో భారీ తెర, 670 సీట్ల సామర్థ్యం, 3 డీ సౌండ్ సిస్టంతో దీనిని అత్యంత అధునాతనంగా నిర్మిస్తున్నారు.

 యూవీ క్రియేషన్స్ అనే సంస్థ రూ.40 కోట్ల వ్యయంతో ఏడున్నర ఎకరాల్లో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత వెడల్పైన తెరలతో కూడిన థియేటర్లు రెండే ఉండగా, ఇది మూడోది. ఆసియాలో రెండోది. ప్రస్తుతం నిర్మిస్తున్న మల్టీప్లెక్స్‌లో 170 సీట్ల సామర్థ్యం కలిగిన మరో రెండు స్క్రీన్లను కూడా నిర్మించనున్నారు.
Andhra Pradesh
sullurupeta
Nellore District
pindipalem
multiplex

More Telugu News