సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- జాన్వీకి సోషల్ మీడియా ఇబ్బంది
- బన్నీ కొత్త సినిమా అప్ డేట్
- 'ఇస్మార్ట్ శంకర్'కి మణిశర్మ సంగీతం
* అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందే చిత్రం షూటింగ్ ఈ నెలలోనే లాంఛనంగా మొదలవుతుంది. ఇక రెగ్యులర్ షూటింగును ఫిబ్రవరి రెండో వారం నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.
* పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. దీనికి సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకున్నారు. త్వరలో షూటింగును ప్రారంభించి, మే నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.