cm: సీఎం చంద్రబాబుని కలిసిన సినీ నటుడు అలీ

  • ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అలీ భేటీ
  • చంద్రబాబుతో ఏకాంతంగా అరగంటపాటు చర్చ
  • బాబును, పవన్ ని అలీ కలవడంపై రాజకీయ చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుని ప్రముఖ హాస్య నటుడు అలీ కలిశారు. చంద్రబాబు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో ఆయన్ని కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఏకాంతంగా అరగంటపాటు అలీ మాట్లాడారు. కాగా, ఈరోజు ఉదయం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని అలీ కలిశారు. అనంతరం, మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా, వైసీపీలో అలీ చేరబోతున్న వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుని, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ ని అలీ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
cm
Chandrababu
ali
Telugudesam
Undavalli

More Telugu News