కష్టపడి, ఇష్టపడి పనిచేస్తే విజయం తథ్యం: వెంకయ్యనాయుడు
- జన్మభూమి కోసమే స్వర్ణభారత్ ట్రస్టు ఏర్పాటు
- పద్దెనిమిదేళ్లుగా సేవలందిస్తున్నాం
- నా పిల్లలు సమాజసేవ చేసేందుకు ముందుకొచ్చారు
బాలల హక్కుల కోసం కైలాస్ సత్యార్థి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. కైలాశ్ సత్యార్థి ఇక్కడకు రావడం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా డీఆర్ డీఏ చైర్మన్ సతీశ్ రెడ్డి గురించి ఆయన ప్రస్తావిస్తూ, సతీశ్ ప్రతిభ చూసి ఆయన కలాం లాంటి వారవుతారని ఎప్పుడో చెప్పానని గుర్తుచేసుకున్నారు. రక్షణ పరిశోధన సంస్థకు తెలుగు వ్యక్తి నేతృత్వం వహించడం గర్వకారణమని అన్నారు.
అలాంటివారు జారిపడటం ఖాయం
మనమాట, హుందాతనం, నడవడికను అనుసరించే మనకు గౌరవం లభిస్తుందని చెప్పారు. ఈ మధ్య కాలంలో కొందరు నాయకులకు నోరుజారడం అలవాటైందని, అలాంటి వారు జారిపడటం ఖాయమని సూచించారు.