Andhra Pradesh: అందులో భాగంగానే కోడికత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించారు: మంత్రి ఆనందబాబు

  • మోదీ, జగన్ లు కుట్ర రాజకీయాలకు తెరలేపారు
  • జగన్ కేసును నీరుగార్చేందుకే హైకోర్టు విభజన చేశారు
  • కన్నా జీవితం హత్యలు, కుట్ర రాజకీయాలమయం
ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్ లు ఏపీలో కుట్ర రాజకీయాలకు తెరలేపారని, అందులో భాగంగానే కోడికత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించారని మంత్రి ఆనందబాబు ఆరోపించారు. అనంతపురంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆనందబాబు మాట్లాడుతూ, జగన్ కేసును నీరుగార్చడం కోసమే హైకోర్టు విభజన చేశారని, కేసుల మాఫీ కోసం ప్రధాని చుట్టూ విజయసాయిరెడ్డి తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఆయన నిప్పులు చెరిగారు. కన్నా జీవితం హత్యలు, కుట్ర రాజకీయాల మయమని ఆరోపించారు. 
Andhra Pradesh
minister
anandbabu
YSRCP
Jagan
modi
bjp
High Court
kanna

More Telugu News