Jagan: వాళ్లిద్దరూ కలిస్తే నాకెందుకు బాధండీ... హ్యాపీగా కలవొచ్చు: 'బాబు-పవన్' కలయికపై వైఎస్ జగన్

  • పవన్, చంద్రబాబు ముసుగులో గుద్దులాట
  • ప్రజలను ఇద్దరూ మోసం చేస్తున్నారు 
  • విడిపోయినట్టు నటిస్తున్నారన్న జగన్
"పవన్ కల్యాణ్, నేను కలిస్తే, జగన్ కు ఎందుకు బాధ?" అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. "నాకెక్కడ బాధండీ. నాకస్సలు బాధలేదు. వాళ్లను కలవమనే చెబుతావున్నా. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? ఎందుకు ప్రజలను మోసం చేస్తా ఉన్నారు? ఇంతకుముందు కలిసి పోటీ చేశారు మీరు. ఇప్పుడు విడిపోయినట్టుగా నటించి మోసం చేస్తావున్నారు. ఎందుకు ప్రజలను మీరు మోసం చేస్తారు? కలిసికట్టుగా ముసుగుతీసేసి రాండయ్యా. నాకు భయం లేదు. నాకు ప్రజల మీద నమ్మకం ఉంది. దేవుడి మీద నమ్మకం ఉంది. ఒక్కడినే పోటీ చేస్తానని చెబుతున్నాను. అంతా మళ్లీ కలిసి రాండయ్యా" అని అన్నారు.

తనపై జరిగిన హత్యాయత్నంపై స్పందిస్తూ, తన పాదయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించగానే, ఎయిర్ పోర్టులో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం మానేశాయని ఆరోపించిన జగన్, మోస్ట్ సెక్యూర్డ్ ఏరియాగా ఉండే ఎయిర్ పోర్టులోని వీఐపీ లాంజ్ లోనే తనపై దాడి జరిగిందని, దీని వెనుక ఎవరి ప్రమేయమూ లేదని చెబితే నమ్మేదెలాగని ప్రశ్నించారు. ఎన్నో సెక్యూరిటీ పారామీటర్స్ ను దాటి ఓ కత్తి అక్కడికి ఎలా రాగలిగిందని అడిగారు. అప్పటికే హత్యారోపణలు వున్న ఓ వ్యక్తికి, విమానాశ్రయంలో పని చేసేందుకు ఎన్ఓసీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
Jagan
Pawan Kalyan
Murder attempt
Chandrababu

More Telugu News