Pawan Kalyan: నెట్టింట జనసేన లెటర్ ప్యాడ్ కలకలం... పోలీసులకు ఫిర్యాదు చేయాలని పవన్ నిర్ణయం!

  • విజయవాడలో ముగ్గురికి టికెట్
  • వారిని గెలిపించాలని పవన్ కోరుతున్నట్టు లేఖ
  • సీరియస్ అయిన పవన్ కల్యాణ్
జనసేన నకిలీ లెటర్ ప్యాడ్ ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న వేళ, దీని సృష్టికర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. తమ పార్టీ తరఫున విజయవాడలో ముగ్గురికి టికెట్ ఇస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ సంతకంతో ఉన్న ఈ లెటర్ హెడ్ గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తమ అభ్యర్థులకు సహకరించాలని, వారిని గెలిపించాలని పవన్ కోరుతున్నట్టు ఈ లేఖలో ఉంది. నకిలీ లెటర్ ప్యాడ్ విషయంలో తీవ్రంగా స్పందించిన పవన్, వెంటనే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయాలని తన లీగల్ సెల్ టీమ్ ను ఆదేశించారు.
Pawan Kalyan
Jana Sena
Letter
Police

More Telugu News